అంగన్వాడి ఉపాధ్యాయులకు ముగిసిన శిక్షణ తరగతులు

ఎడపల్లి, సెప్టెంబర్ 18 ( లోకంతీరు ) : మహిళ శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఐసిడిఎస్ బోధన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పోషన్ బి, పడాయి బి అనే అంశంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ బోధన్ సమావేశ మందిరంలో నిర్వహించారు. గురువారంతో శిక్షణ తరగతులు ముగిసాయి. ఈ కార్యక్రమాలను సిడిపిఓ పద్మ, విజయవంతంగా నిర్వహించారు. అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోషణ్ మాసం కార్యక్రమాలను ప్రారంభంచేసిన వీడియోని ఐసిడిఎ స్ మండలాల పర్యవేక్షకులకు, అంగన్వాడి ఉపాధ్యాయులకు,సిడిపిఓ పద్మ గార్లకు చూపించడం జరిగింది. మూడు రోజులుగా కొనసాగిన శిక్షణఈ కార్యక్రమాలకు అబ్జర్వర్‌గా గోపాలకృష్ణ ఆసిఫాబాద్ జిల్లా, అదేవిధంగా నిజాంబాద్ జిల్లా సాధికారక కేంద్రం కోఆర్డినేటర్ స్వప్న, ఐసిడిఎస్ అధికారులు సాయిలు ముగింపు శిక్షణ తరగతులకు ప్రత్యేక ముఖ్య అతిథులుగారావడం జరిగిందని ఐసిడిఎస్ బోధన్ ప్రాజెక్ట్ సిడిపిఓ పద్మతో పాటు పర్యవేక్షకులు, అంగన్వాడి ఉపాధ్యాయులు తెలిపారు. ఇలాంటి శిక్షణ పొందడం తమకెంతో ఆనందం ఇచ్చిందని, అంగన్వాడి కేంద్రంకి వచ్చే చిన్నారి బాల బాలికలకు, మహిళ గర్భిణులకు బాధితులకు, ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని శిక్షణ ఎంతో నేర్పించారనిఅంగన్వాడి ఉపాధ్యాయులు తెలిపారు. ఇలాంటి శిక్షణ తరగతులు భవిష్యత్తులో అంగన్వాడి కేంద్ర ఉపాధ్యాయులకు ఎంతో దోహదపడతాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు అంగన్వాడీ టీచర్లు తెలిపారు